: ఆరు గంటల ఢిల్లీ - జైపూర్ రోడ్డు ప్రయాణాన్ని రెండు గంటలకు కుదించేలా సరికొత్త హైవే: నితిన్ గడ్కరీ
కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మరో ఆసక్తికరమైన రహదారి ప్రాజెక్టును ప్రకటించారు. దేశ రాజధానికి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ ను కలుపుతూ ఇప్పుడున్న ఎన్ హెచ్ 8 స్థానంలో సరికొత్త రహదారిని నిర్మించనున్నట్టు ఆయన ప్రకటించారు. మొత్తం రూ. 1,005 కోట్ల అంచనా వ్యయంతో 15 నెలల్లో పూర్తయ్యేలా మూడు జంక్షన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం మాట్లాడారు. కొత్త జాతీయ రహదారికి జనవరిలో పనులు ప్రారంభమవుతాయని, రూ. 16 వేల కోట్ల వరకూ ఢిల్లీ - జైపూర్ నూతన రహదారికి ఖర్చవుతాయని ఆయన అన్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే, ప్రస్తుతం 6 గంటలు పడుతున్న ప్రయాణ సమయం 2 గంటలకు తగ్గుతుందని తెలిపారు.