: ముగ్గురు యువతులపై యాసిడ్ దాడి చేసి పరారైన దుండగులు
ముగ్గురు యువతులపై ఒకే సమయంలో యాసిడ్ దాడి జరిగిన దారుణ ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుంది. బంకురా జిల్లాలో నిన్న సాయంత్రం ట్యూషన్ నుంచి ముగ్గురు యువతులు బస్సులో తమ ప్రాంతాలకు వెళుతోన్న సమయంలో ఈ దారుణం జరిగింది. వారు ముగ్గురు బస్సు దిగుతోన్న సమయంలో పలువురు గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ చల్లారు. ఘటనపై స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. గాయపడిన యువతులను ఆసుపత్రికి తరలించారు. తమపై దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరో తమకు తెలియదని బాధిత యువతులు చెబుతున్నారు. యాసిడ్ దాడి చేసిన వారికి ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.