: రాజ‌ధాని ముసుగులో విప‌రీత‌మైన అవినీతికి తెర‌తీశారు: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి


ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌వ్య‌రాజ‌ధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం అమలు చేస్తున్న స్విస్ ఛాలెంజ్ విధానంపై ఈరోజు హైకోర్టు స్టే విధించిడం స‌ర్కారుకి చెంపపెట్ట‌ని వైసీపీ నేత భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్రం కార్యాల‌యంలో భూమ‌న మాట్లాడుతూ... రాజ‌ధాని నిర్మాణానికి తాము వ్య‌తిరేకం కాదని అన్నారు. దానిలో జ‌రుగుతోన్న అక్ర‌మాల‌ను మాత్ర‌మే తాము నిల‌దీస్తున్నామ‌ని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడుకి ద‌మ్ము, ధైర్యం ఉంటే కోర్టు ఆధ్వ‌ర్యంలో సీబీఐ విచార‌ణ న‌డ‌వాల్సిందిగా చంద్ర‌బాబే కోర్టుకు నివేదించాల‌ని ఆయ‌న‌ డిమాండ్ చేశారు. రాజ‌ధాని ముసుగులో విప‌రీత‌మైన అవినీతికి తెర‌తీశారని ఆయ‌న ఆరోపించారు. సింగ‌పూర్ కంపెనీల‌కు భూముల‌ను క‌ట్ట‌బెట్టాల‌ని చూస్తున్నారని ఆయ‌న విమర్శించారు.

  • Loading...

More Telugu News