: అమెరికాలో మరోసారి కాల్పుల అలజడి.. ఒకరి మృతి


అమెరికాలో మరోసారి కాల్పుల అలజడి చెలరేగింది. ఆ దేశంలోని బర్మింగ్‌హామ్‌, గేట్‌సిటీలోని పబ్లిక్‌ హౌసింగ్‌ కమ్యూనిటీ వద్ద శాంతి ర్యాలీ జరిగింది. అనంత‌రం ఆ ప్రాంతంలో దుండ‌గులు కాల్పులు జ‌రిపి, వెంట‌నే అక్కడి నుంచి పారిపోయారు. ఈ కాల్పుల్లో ర్యాలీని చూసేందుకు వచ్చిన ఆరుగురు పౌరులకు గాయాల‌య్యాయి. వెంట‌నే వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే చికిత్స పొందుతున్న వారిలో ఒకరు మృతి చెందినట్లు అక్క‌డి పోలీసులు పేర్కొన్నారు. కాల్పుల ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు దుండ‌గుల గురించి గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News