: ప్రకాశం జిల్లాలో నిలిచిన 'దురంతో' ఎక్స్ ప్రెస్, ఎక్కడికక్కడ ఆగిన రైళ్లు!
హజ్రత్ నిజాముద్దీన్ నుంచి చెన్నై వెళ్లే 'దురంతో' ఎక్స్ ప్రెస్ ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రకాశం జిల్లా వేటపాలెం సమీపంలో నిలిచిపోయింది. దీంతో ఈ మార్గంలో నడవాల్సిన రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంజన్ లో సాంకేతిక లోపంతోనే రైలు ఆగినట్టు వెల్లడించిన అధికారులు, యుద్ధ ప్రాతిపదికన సమస్యను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. పట్టాలపై రైలు ఆగడంతో ఒంగోలు - గూడురు పాసింజర్, హిమసాగర్ ఎక్స్ ప్రెస్, గురుదేవ్ ఎక్స్ ప్రెస్, పూరీ - చెన్నై ఎక్స్ ప్రెస్, నవయుగా ఎక్స్ ప్రెస్, తిరునల్వేలీ - జమ్మూ ఎక్స్ ప్రెస్ తదితర రైళ్లపై ప్రభావం పడ్డట్టు తెలుస్తోంది.