: కాంగ్రెస్ తీరుపై మండిపడ్డ టీఆర్ఎస్ ఎంపీ వినోద్
గవర్నర్ నరసింహన్కు తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న భూసేకరణపై ఈరోజు టీపీసీసీ నేతలు ఫిర్యాదు చేయడం పట్ల, కాంగ్రెస్ పార్టీ తీరుపట్ల టీఆర్ఎస్ ఎంపీ వినోద్ మండిపడ్డారు. గోదావరి, కృష్ణా నదీ జలాలను సద్వినియోగం చేసుకోవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నదీ జలాలు పంట పొలాలకు మళ్లించాలన్న ప్రయత్నాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే నదీ జలాలు తెలంగాణ ప్రజలకు అందేవని, అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయిందని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు వేగంగా పూర్తయితే కాంగ్రెస్ పార్టీ ఇకపై తెలంగాణలో నిలదొక్కుకోలేదనే భయంతోనే ఆ పార్టీ నేతలు తమపై విమర్శలు గుప్పిస్తున్నారని వినోద్ అన్నారు. కాంగ్రెస్ నేతలకు సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన లేదని ఆయన విమర్శించారు. పార్టీ ఉనికి చాటుకునేందుకే గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. పరిహారం కోసం డిమాండ్ చేయండి.. కానీ రైతులకు మాత్రం అన్యాయం చేయొద్దు అని ఆయన సూచించారు.