: మిత్రపక్షం ఆర్జేడీ చేస్తోన్న విమర్శలపై స్పందించిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్


త‌మ మిత్రప‌క్షం రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీ సీనియర్ నాయకులు త‌న‌పై గుప్పించిన విమ‌ర్శ‌ల ప‌ట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్, మహమ్మద్ షహబుద్దీన్ లు ఇటీవ‌ల నితీశ్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ష‌హ‌బుద్దీన్ మాట్లాడుతూ నితీశ్ ను బీహార్ సీఎంగా ఎంపిక చేయ‌డానికి త‌మ‌ కూటమి తీసుకున్న నిర్ణయాన్ని తాను ఒప్పుకోలేద‌ని అన్నారు. ఈ వ్యాఖ్య‌లు బీహార్‌లో రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీశాయి. దీంతో ముఖ్యమంత్రి నితీశ్ స్పందిస్తూ... త‌మ గురించి ఎవరేమనుకున్నా తాను పట్టించుకోబోనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలంద‌రూ తనపై ఎంతో నమ్మకం ఉంచారని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌జ‌లు కోరుకున్న విధంగానే వారికి అనుగుణంగా పాల‌న‌ కొన‌సాగిస్తున్న‌ట్లు చెప్పారు. ఆర్జేడీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను పట్టించుకోబోనని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News