: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బుల్లెట్ కలకలం
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం ఓ ప్రయాణికుడి వద్ద భద్రతా సిబ్బందికి బుల్లెట్ దొరకడం అలజడి రేపింది. ప్రయాణికుల తనిఖీలో భాగంగా హైదరాబాద్ నుంచి కువైట్‌కు బయలుదేరిన ముషీర్ అహ్మద్ అనే వ్యక్తిని విమానాశ్రయ సిబ్బంది ఈరోజు తనిఖీ చేశారు. అతని వద్ద తుపాకి బుల్లెట్ ఉన్నట్లు కనుగొన్నారు. అతడిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆరా తీస్తున్నారు. బుల్లెట్‌తో పట్టుబడ్డ వ్యక్తి హైదరాబాద్‌లోని పాతబస్తీ తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇటీవల ప్రయాణికులు బుల్లెట్లతో పట్టుబడుతున్న ఘటనలు అధికంగానే వెలుగులోకొస్తున్నాయి.