: చిత్తూరు జిల్లాలో హైటెక్ సెక్స్ రాకెట్!... ‘అనంత’, బెంగళూరుల్లో మూలాలు!


ఏపీలోని చిత్తూరు జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టైంది. చాలాకాలంగా సాగుతున్న ఈ వ్యవహారం మూలాలు కర్ణాటక రాజధాని బెంగళూరు, ఏపీలోని అనంతపురం జిల్లాల్లోనూ ఉన్నాయి. ఈ మేరకు పక్కా సమాచారం సేకరించిన చిత్తూరు జిల్లా పోలీసలు నేటి ఉదయం జిల్లాలోని మదనపల్లి, పుంగనూరు, పొరుగునే ఉన్న అనంతపురం, ఆ జిల్లాలోని కదిరి, బెంగళూరులో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా 38 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 13 మంది నిర్వాహకులు, ఐదుగురు బ్రోకర్లు, 9 మంది విటులు, 11 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు.

  • Loading...

More Telugu News