: గవర్నర్ తో గంటపాటు మాట్లాడిన చంద్రబాబు


ఈ ఉదయం 9:30 గంటల సమయంలో హైదరాబాదు, సోమాజిగూడలోని రాజ్ భవన్ కు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు, దాదాపు గంట పాటు గవర్నర్ నరసింహన్ తో చర్చలు జరిపారు. గవర్నర్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి, డ్రై ఫ్రూట్స్ బాక్స్ అందించిన చంద్రబాబు, ఆయనతో సమావేశమై పలు విషయాలను చర్చించినట్టు తెలుస్తోంది. కేంద్రం ప్రత్యేక హోదాను ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేస్తూ, దానికి ప్రతిగా ప్యాకేజీని ఇస్తామని చెప్పిన తరువాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపైనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఆపై మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల వివరాలను, జీఎస్టీ బిల్లుకు ఆమోదం తదితర విషయాలను నరసింహన్ వద్ద చంద్రబాబు ప్రస్తావించారని సమాచారం. అమరావతి నిర్మాణానికి పాటిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై కోర్టులో నడుస్తున్న కేసుల గురించి కూడా గవర్నర్ కు చంద్రబాబు వివరించినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News