: విజృంభించండి... శాంతిని నెలకొల్పండి: సైన్యానికి స్పష్టం చేసిన రాజ్ నాథ్


కాశ్మీర్ లోయలో యువతను రెచ్చగొడుతూ వారిని నిరసన ప్రదర్శనలకు, హింసకు పురిగొల్పుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని, రాళ్ల దాడులకు దిగుతున్న వారిని ఉపేక్షించవద్దని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ఆయన, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇంటెలిజెన్స్ విభాగం అధికారులతో సమావేశమయ్యారు. కాశ్మీర్ లోయలో అన్ని పాఠశాలలూ మరో వారంలో తెరచుకోవాలని, విద్యార్థులు భయం లేకుండా స్కూళ్లకు వెళ్లే పరిస్థితి రావాలని ఆయన సూచించారు. ఇదే సమయంలో బీఎస్ఎఫ్ పరీక్షలో తొలి ర్యాంకు సాధించిన ఉధంపూర్ యువకుడు నబీల్ అహ్మద్ వానీతో రాజ్ నాథ్ మాట్లాడారు. అనంత్ నాగ్, పూంఛ్ జిల్లాల్లో జరిగిన చొరబాట్లు, ఎన్ కౌంటర్లలో ఏడుగురు ఉగ్రవాదులు హతమైన ఘటనలపైనా రాజ్ నాథ్ సింగ్ అధికారులతో చర్చించారు. వారం రోజుల్లో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా సెక్యూరిటీ ఫోర్సెస్, ఇంటెలిజెన్స్ ఏజన్సీలు పనిచేయాలని, యువతకు రాళ్లిచ్చి పంపుతున్న వారిని ఉపేక్షించ వద్దని ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News