: అనుప్రియ పటేల్ కాన్వాయ్ పై యూపీలో దాడి... రోడ్డుపై ధర్నాకు దిగిన కేంద్ర మంత్రి!


నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బాధ్యతలు చూస్తున్న అప్నాదళ్ పార్టీ ఎంపీ అనుప్రియ పటేల్ కాన్వాయ్ పై దాడి జరుగగా, తనకు భద్రత కల్పించడంలో అఖిలేష్ సర్కారు విఫలమైందని ఆరోపిస్తూ, ఆమె నడిరోడ్డుపై బైఠాయించారు. మంత్రి ఉత్తరప్రదేశ్ లోని రాణీగంజ్ కి వెళుతున్న వేళ, గుర్తు తెలియని కొందరు దుండగులు ఆమె కాన్వాయ్ పై దాడి చేశారు. ఎమ్మెల్యే ఆర్కే వర్మపై చెయ్యి చేసుకున్నారు. దీనిని నిరసిస్తూ, దాడి చేసిన వారిని అరెస్ట్ చేసే వరకూ కదిలేది లేదంటూ ధర్నా నిర్వహించారు. కేంద్ర మంత్రిగా ఉన్న తనకే యూపీలో భద్రత లేదని, ఇక సామాన్య ప్రజలకు, మహిళలకు భద్రత ఎక్కడుందని ప్రశ్నించారు. యూపీ సర్కారు కనీస ప్రొటోకాల్ నిబంధనలను సైతం పక్కన బెట్టిందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News