: కేవీపీని ఒంటరి చేసింది కాంగ్రెస్సేనట!... మాజీ ఎంపీ సబ్బం హరి సంచలన వ్యాఖ్య!


విశాఖ జిల్లా అనకాపల్లి మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ వేత్త సబ్బం హరి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ తెలుగు ఛానెల్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలాన్నే రేపేలా ఉన్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లును ప్రస్తావిస్తూ సబ్బం హరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు విషయంలో కేవీపీకి కాంగ్రెస్ పార్టీ ఓ గుణపాఠం నేర్పిందని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని కేవీపీకి భ్రమలు కల్పించిన కాంగ్రెస్ నేతలు... పార్టీలో ఆయనను ఒంటరిని చేశారని సబ్బం హరి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News