: చంద్రబాబు భాగ్యనగరి పర్యటన ముగిసింది!... నేడు బెజవాడకు ఏపీ సీఎం!
ఏపీ అసెంబ్లీ సమావేశాల కోసం భాగ్యనగరికి చేరుకున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేటితో తన హైదరాబాదు పర్యటన ముగించుకోనున్నారు. మరికాసేపట్లో హైదరాబాదు నుంచి బయలుదేరనున్న చంద్రబాబు నేరుగా విజయవాడ చేరుకుంటారు. మూడు రోజుల పాటు జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు శనివారమే ముగిసినా... ఆదివారం సెలవు దినం కావడంతో చంద్రబాబు నిన్న కూడా హైదరాబాదులోనే ఉన్నారు. ఇక నేడు, రేపు ఆయన విజయవాడలో ఉంటారు. ఆ తర్వాత బుధవారం ఆయన విశాఖ పర్యటనకు బయలుదేరతారు.