: ప్యాసెంజర్స్ కు చుక్కలు చూపిన కేశినేని ట్రావెల్స్!... రాత్రివేళ నడిరోడ్డుపై ప్రయాణికుల పడిగాపులు!


తెలుగు నాట ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. రెండు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ప్రైవేట్ ట్రావెల్స్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న కేశినేని ట్రావెల్స్ కూడా ఈ జాబితాలో చేరిపోయింది. నిన్న రాత్రి హైదరాబాదు నుంచి 29 మంది ప్రయాణికులతో నెల్లూరు బయలుదేరిన కేశినేని ట్రావెల్స్ బస్సు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నల్లగొండ సమీపంలో నడిరోడ్డుపై నిలిచిపోయింది. సాంకేతిక లోపంతో బస్సు నిలిచిపోయిందని చెప్పిన యాజమాన్యం... ప్రత్యామ్నాయం చేస్తున్నామని చెప్పి ప్రయాణికులందరినీ రాత్రంతా నడిరోడ్డుపైనే జాగారం చేయించింది. నేటి ఉదయం తెల్లవారినా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కనిపించకపోగా, యాజమాన్యం నుంచి స్పందన కూడా కరవైంది. దీంతో కేశినేని ట్రావెల్స్ యాజమాన్యంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News