: మాల్యా విదేశీ ఆస్తులపైనా ఈడీ కన్ను!
అడిగిందే తడవుగా రుణాలిచ్చిన బ్యాంకులకు చుక్కలు చూపిస్తున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చుట్టూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే రెండు విడతలుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రూ.8 వేల కోట్లకు పైగా మాల్యా ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విదేశాల్లో మాల్యా కూడబెట్టిన ఆస్తులను కూడా అటాచ్ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో యూకే, దక్షిణాఫ్రికాలోని మాల్యా ఆస్తుల చిట్టాపై ఆరా తీస్తోంది. మాల్యా, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న విదేశీ ఆస్తుల వివరాలను సేకరించిన తర్వాత మాల్యాకు సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేయాలని, వాటికి మాల్యా స్పందించకపోతే... వాటిని కూడా అటాచ్ చేయాలని ఆ సంస్థ అధికారులు భావిస్తున్నారు.