: జకోవిచ్ కు ఝలక్!... యూఎస్ ఓపెన్ విజేతగా వావ్రింకా!


ఈ ఏడాది యూఎస్ ఓపెన్ లో అన్నీ సంచలనాలే. గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో అత్యధిక విజయాలు సాధించిన నల్ల కలువ సెరెనా విలియమ్స్... మరో గ్రాండ్ స్లామ్ టైటిల్ వేటలో చివరి మెట్టుపై బోల్తా పడింది. ఇక పురుషుల సింగిల్స్ లోనూ జైత్రయాత్ర సాగిస్తున్న వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ నోవాక్ జకోవిచ్ కు కూడా పెను షాక్ తగిలింది. భారత కాలమానం ప్రకారం నేటి తెల్లవారుజామున జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ లో జకోవిచ్ ను మూడో సీడ్ స్టాన్ వావ్రింకా చిత్తుగా ఓడించాడు. ఈ విజయంతో 46 ఏళ్ల యూఎస్ ఓపెన్ చరిత్రలోనే టైటిల్ సాధించిన అతి పెద్ద వయసు కలిగిన క్రీడాకారుడిగా వావ్రింకా రికార్డులకెక్కాడు. 31 ఏళ్ల వయస్సున్న వావ్రింకాకు ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. ఉత్కంఠభరితంగా సాగిన టైటిల్ పోరులో 6-7, 6-4, 7-5, 6-3 స్కోరుతో జకోవిచ్ ను వావ్రింకా మట్టి కరిపించాడు.

  • Loading...

More Telugu News