: కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేత వీరస్వామి దారుణ హత్య


కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలోని మార్కేండేయ కాలనీలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దార వీరస్వామి (66) దారుణ హత్యకు గురయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున మార్కండేయ కాలనీలో చెట్లపొదల్లో ఆయన మృతదేహం కనపడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భూవివాదాలే హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News