: ఒకవేళ మా కన్నతండ్రి సీఎం అయినా వైఎస్ చూసినట్లుగా మమ్మల్ని చూసేవారు కాదు!: కన్నీటి పర్యంతమైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి


ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్ చనిపోయిన సంవత్సరానికే ప్రజలు వారిని మర్చిపోయారు కానీ, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిని మాత్రం ప్రజలు ఇంకా మర్చిపోలేదని వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి ఏడేళ్లవుతున్నా ప్రతి కుటుంబంలోని వ్యక్తి ఇంకా బాధతోనే ఉన్నారు. నేను అజ్ఞాత జీవితం నుంచి బయటకు వచ్చిన తర్వాత, రాజారెడ్డి గారు బాగా దగ్గరైన తర్వాత చాలా బాగా జీవితాన్ని గడిపాను. రాజారెడ్డి గారు హత్యకు గురైన తర్వాత, చాలా కాలం పాటు వైఎస్ రాజశేఖరరెడ్డి గారి దగ్గర గడపవలసి వచ్చింది. ఆయనతో పాటు కలిసి ఉన్న సంవత్సరాలు, ఆయనతో పాటు కలసి చేసిన వేల కిలోమీటర్ల ప్రయాణం మర్చిపోలేను. ఒకవేళ మా కన్న తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా వైఎస్ రాజశేఖర రెడ్డిగారిలా మమ్మల్ని చూసుకునేవారు కాదు. ఆయన్ని ఎప్పటికీ మరువలేము’ అంటూ చెవిరెడ్డి భాస్కరరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు.

  • Loading...

More Telugu News