: ఏపీకిచ్చిన ప్యాకేజ్ బాగుందని జైరాం రమేష్ కూడా నాతో చెప్పారు!: సుజనా చౌదరి
ఏపీకి ప్రకటించిన ప్యాకేజ్ చాలా మంచిదని, రాష్ట్రం దూసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఈ ప్యాకేజ్ కు త్వరగా చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా ఉంటేనే, ఉద్యోగాలు వస్తాయన్న భావన తప్పని స్పష్టం చేశారు. వచ్చే పది, పదిహేనేళ్లలో ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలు మారబోతున్నాయని అన్నారు. ప్రత్యేక హోదా అంటూ రాజకీయ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, రాజకీయ పోరాటం కావాలంటే 2019లో చేసుకోవచ్చన్నారు. ఏపీకిచ్చిన ప్యాకేజ్ బాగుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ కూడా తనతో చెప్పారని అన్నారు. ఏపీకి ఏమి కావాలనే విషయాన్ని రెండేళ్లుగా కేంద్రం అధ్యయనం చేసిందని.. ఒకవేళ, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినా నష్టం జరుగుతుందన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని సుజనా చౌదరి అన్నారు.