: మా వాళ్లిద్దరూ ముదిరిపోయారు: సినీ నటుడు నాగార్జున
‘మా వాళ్లిద్దరూ ముదిరిపోయారు. అందుకే, ‘నిర్మలా కాన్వెంట్’ సినిమా కోసం నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ ని తీసుకున్నాము’ అన్నారు ప్రముఖ సినీ నటుడు నాగార్జున. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాకు 16 లేదా 17 సంవత్సరాల వయసున్న కుర్రాడు కావాలి. నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ ఈ చిత్రానికి కరెక్టుగా సరిపోయాడు. చాలా బాగున్నాడు’ అని నాగ్ చెప్పారు. ‘మీ పిల్లలిద్దరూ హీరోలే కదా, ఈ చిత్రంలో హీరోగా వాళ్లలో ఒకరిని తీసుకోవచ్చుగా?’ అనే ప్రశ్నకు నాగార్జున సమాధానమిస్తూ, ‘మావాళ్లిద్దరూ ముదిరిపోయారు. వాళ్లిద్దరు ఆ వయసు ఎప్పుడో దాటేశారు. అంతేకాకుండా, ఈ కథకు వాళ్లిద్దరూ సరిపోరు. ఈ ఏడాది ముగిసే లోపు నాగచైతన్య, అఖిల్ తో రెండు సినిమాలు మొదలవుతాయి’ అని సమాధానమిచ్చారు.