: సుబ్రహ్మణ్యస్వామిని ‘తమిళరత్న’ బిరుదుతో సన్మానించిన ప్రవాసులు


ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న బీజేపీ సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామిని ‘తమిళ రత్న’ అవార్డుతో అమెరికాలోని తమిళ సంఘం సత్కరించింది. ఈ విషయాన్ని తమిళ సంఘం అధ్యక్షుడు ప్రకాశ్ స్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరులో మరింత పారదర్శకతను తీసుకురావడం కోసం చేస్తున్న కృషికి, అవినీతికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి గాను ఆయన్ని ఈ అవార్డుతో సత్కరించామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, గతంలో ‘తమిళరత్న’ అవార్డును స్వీకరించిన ప్రముఖుల్లో సినీ దర్శకుడు భారతీ రాజా, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఉన్నారు.

  • Loading...

More Telugu News