: ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న వెంకయ్యనాయుడు


హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడిని కేంద్ర, తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈరోజు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రి హరీష్ రావు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు మంత్రులకు శాలువాలు కప్పి సత్కరించారు. కాగా, ఈరోజు సెలవు దినడం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకున్నారు. ఉదయం నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో పరిసరాలు సందడిగా మారాయి.

  • Loading...

More Telugu News