: పవన్ పాడిన పాట బాగుందా?... నేను పాడిన పాట బాగుందా?: రాంగోపాల్ వర్మ


కాకినాడ సభలో పవన్ కల్యాణ్ పాడిన పాట బాగుందా? లేక ‘వంగవీటి’ చిత్రంలో తాను పాడిన ‘చంపరా’ అనే పాట బాగుందా? అంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ ప్రశ్నను సంధించారు. ట్విట్టర్ ఖాతా ద్వారా తన పాటను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కల్యాణ్ అభిమానులు ఈ విషయాన్ని చెప్పాలని కోరారు. అంతేకాకుండా, సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, ఎస్ఎస్ థమన్ లను ఈ విషయమై మీడియా ప్రశ్నించాలని వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News