: చివరి ట్రయల్ విజయవంతం... 12 గంటల్లో ఢిల్లీ నుంచి ముంబైకి చేరిన టాల్గో
ఇండియాలో అత్యంత వేగంగా నడిచే టాల్గో రైలు ఢిల్లీ నుంచి ముంబై మధ్య చివరి ట్రయల్ రన్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఢిల్లీలో మధ్యాహ్నం 2:45 గంటలకు బయలుదేరిన రైలు, గత అర్ధరాత్రి 2:34 గంటలకు ముంబై చేరుకుంది. రెండు నగరాల మధ్యా ఉన్న ప్రయాణ మార్గాన్ని 16 గంటల నుంచి 12 గంటలకు ఈ రైలు తగ్గించింది. స్పెయిన్ లో తయారైన లైట్ వెయిట్ కోచ్ లతో ఉండే రైలు, ఒక దశలో గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని సైతం అందుకుంది. రెండు ఎగ్జిక్యూటివ్, నాలుగు చైర్ కార్లతో పాటు, ఓ కెఫెటేరియా, ఓ పవర్ కార్, స్టాఫ్ కోసం చివర్లో మరో కోచ్ ఇందులో ఉంటాయి. ఢిల్లీ, ముంబై మధ్య 1,400 కిలోమీటర్ల దూరం ఉండగా, రాజధాని ఎక్స్ ప్రెస్ 16 గంటల్లో గమ్యానికి చేరుతోందన్న సంగతి తెలిసిందే.