: శాతకర్ణుడి సరసన వశిష్టి దేవి... బర్త్ డే కానుకగా శ్రియ పోస్టర్, మీరూ చూడండి!


బాలకృష్ణ తన 100వ చిత్రంలో గౌతమీపుత్ర శాతకర్ణిగా నటిస్తుండగా, ఆయన భార్య వశిష్టి దేవి పాత్రకు అందాల తార శ్రియ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇటీవలి షెడ్యూల్ లో ఆమె పాత్ర షూటింగ్ కూడా మొదలైంది. నేడు శ్రియ పుట్టినరోజు కావడంతో ఆమె క్లోజప్ తో కూడిన పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో మహారాణి గెటప్ లో శ్రియ కనిపిస్తుండగా, 'హ్యాపీ బర్త్ డే వశిష్టి దేవి' అన్న క్యాప్షన్ కూడా ఉంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో షూటింగ్ దశలో ఉన్న చిత్రాన్ని సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసి 2017 సంక్రాంతికి విడుదల చేయాలన్న యోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నారు.

  • Loading...

More Telugu News