: లారీని ఢీకొన్న జబ్బార్ ట్రావెల్స్ బస్సు... నలుగురు మృతి, 15 మందికి గాయాలు
విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన బస్సు చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మండలం మొగలి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ తెల్లవారుఝామున వేగంగా వస్తున్న బస్సు ఆగివున్న లారీని ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 15 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకుని వెంటనే స్పందించిన పోలీసులు, స్థానికులు గాయపడిన వారిని పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో అజాగ్రత్తగా ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రయాణికులు చెబుతున్నారు.