: యూఎస్ ఓపెన్ లో కొత్త క్వీన్... తొలిసారి గెలిచిన కెర్బర్


ఈ ఏడాది యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగం కొత్త టెన్నిస్ తారను పరిచయం చేసింది. సెరీనా విలియమ్స్ వంటి సూపర్ స్టార్లు సెమీఫైనల్ దశలోనే ఇంటిదారి పట్టిన వేళ, చెక్ రిపబ్లిక్ కు చెందిన పదో సీడ్ కారోలినా ప్లిస్కోవాతో పోటీ పడిన జర్మనీ క్రీడాకారిణి ఏంజలిక్ కెర్బర్ తొలిసారిగా యూఎస్ ఓపెన్ టైటిల్ ను కైవసం చేసుకుంది. దాదాపు రెండు గంటలు సాగిన మ్యాచ్ లో 6-3, 4-6, 6-4 తేడాతో కెర్బన్ విజయం సాధించింది. ఇది ఆమెకు రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. ఈ విజయం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, ఈ సంవత్సరం తాను రెండు టైటిళ్లు గెలవడంతో ఎంతో గర్వంగా ఉందని మ్యాచ్ అనంతరం కెర్బర్ వ్యాఖ్యానించింది. ఈ విజయంతో ఆమె వరల్డ్ నంబర్ వన్ సెరీనా విలియమ్స్ ను కిందకు నెట్టి తొలి ర్యాంకును దక్కించుకుంది.

  • Loading...

More Telugu News