: ఖైరతాబాద్ గణనాథుడిని సందర్శించి, పూజలు నిర్వహించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సాయంకాలం ఖైరతాబాద్ గణనాయకుణ్ణి సందర్శించారు. పార్టీ శ్రేణులతో కలసి ఖైరతాబాద్ చేరుకున్న చంద్రబాబునాయుడు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. సకాలంలో వర్షాలు పడి రైతుల చేతికి పంట అందిరావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలంతా ఆనందంగా ఉండాలని ఆయన గణేషుని కోరుకున్నట్టు తెలిపారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని, వినాయకుడు విఘ్ననాయకుడని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆదుకుంటాడని ఆయన తెలిపారు.