: చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు సమావేశమయ్యారు. హైదరాబాదులోని లేక్ వ్యూ క్యాంప్ కార్యాలయంలో కుమార్తె మంచు లక్ష్మితో కలసి వచ్చిన మోహన్ బాబు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశానని ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రత్యేకహోదాపై పోరు రగులుకుంటున్న దశలో వీరి భేటీ ఆసక్తి రేపుతోంది. కాగా, గతంలో ఓ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తరువాత అంత స్థాయి కలిగిన రాజకీయ నాయకుడు కేసీఆర్ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News