: ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయగల ఏకైక పార్టీ టీఆర్ఎస్: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి స్థాయి న్యాయం చేయగల ఏకైకపార్టీ టీఆర్ఎస్ అని తెలంగాణ పంచాయతీరాజ్, మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ఓ టీవీ ఛానెట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి టీఆర్ఎస్ న్యాయం చేయగలదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ కారణంగా ఏపీకి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయని ఆయన తెలిపారు. 'విద్యాసంస్థలు, పోర్టులు, విమానాశ్రయాలు, పరిశ్రమలు, ప్యాకేజీలు, హోదాలు ఇలా ఎన్నో ప్రయోజనాలను ఏపీ సొంతం చేసుకుందంటే దానికి కారణం టీఆర్ఎస్ పార్టీయే కదా' అంటూ ఆయన లాజిక్ తీశారు.