: 'నన్ను చెప్పుతో కొడతానన్నారు...' అంటూ శాసనమండలిలో భావోద్వేగానికి గురైన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి ప్రకటన రాకపోవడంతో బీజేపీ, తెలుగుదేశం నేతల తీరుపై పలువురు చేసిన విమర్శల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు శాసనమండలిలో స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. మంచిపనులు చేస్తున్న తమపై ఎన్నో విమర్శలు గుప్పిస్తున్నారని, తనను చెప్పుతో కొడతానని కొందరు అన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనపై చేసిన ఈ వ్యాఖ్యకు తాను ఎంతగానో బాధపడినట్లు తెలిపారు. అయినా దాన్ని గుండెల్లోనే పెట్టుకున్నట్లు చెప్పారు. తనను ఇరవయ్యేళ్లుగా ఆ భగవంతుడే ముందుకు తీసుకుకెళుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు.