: మూర్ఖంగా ముందుకు వెళితే చివరికి ఏదీ మిగలదు: హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి స్పందించారు. ఏ రాష్ట్రానికీ హోదా ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రం చెబుతోందని ఆయన అన్నారు. కేంద్రం పెద్దలు ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలన్నీ ఇస్తామంటున్నారని ఆయన పేర్కొన్నారు. పోలవరం నిర్మాణంపై కూడా పలువురు విమర్శలు చేస్తున్నారని, హోదా వచ్చే వరకూ పోలవరం నిర్మాణం చేయవద్దా? అని ప్రశ్నించారు. తానెప్పుడైనా రాజీ పడితే అది ప్రజల కోసమేనని, తనకు ప్రజలే హై కమాండ్ అని ఆయన అన్నారు. తాను ఆచరణవాదినే కానీ, సిద్ధాంతాలు చెప్పేవాడినని కాదని చంద్రబాబు పేర్కొన్నారు. మూర్ఖంగా ముందుకు వెళితే ఏదీ మిగలదని వ్యాఖ్యానించారు.