: మీకు అంత సత్తా వుంటే అప్పుడు అల్లు అరవింద్ ను ఎందుకు గెలిపించుకోలేకపోయారు?: పవన్ కల్యాణ్ ను ఎద్దేవా చేసిన అయ్యన్నపాత్రుడు
పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. "ఎంపీ అవంతి శ్రీనివాస్ ను గెలిపించే సత్తా ఉంటే కనుక... గతంలో అనకాపల్లి నుంచి పోటీ చేసిన బావ అల్లు అరవింద్ ను అప్పటికే టాలీవుడ్ లో పెద్ద నటులైన నువ్వు, నీ అన్న ఎందుకు గెలిపించుకోలేకపోయారు?" అంటూ మంత్రి అయ్యన్నపాత్రుడు పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, 'అలాంటి మీరు ఇప్పుడు అవంతి శ్రీనివాస్ రాజీనామా చేస్తే గెలిపిస్తారా?' అని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ఇష్టారాజ్యంగా మాట్లాడకుండా వాస్తవాలు మాట్లాడాలని ఆయన సూచించారు. పవన్ కల్యాణ్ అలా మాట్లాడటానికి ఓ అర్థం ఉండాలని ఆయన ఎద్దేవా చేశారు. కాగా, ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంపీ అవంతి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేస్తే, జనసేన నుంచి అనకాపల్లి టిక్కెట్ ఇచ్చి తాను అక్కడే ఉండి గెలిపిస్తానంటూ పవన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.