: పారా ఒలింపిక్స్ లో భారత్ కు డబుల్ ధమాకా!... హైజంప్ లో గోల్డ్ తో పాటు కాంస్యం కూడా మనవే!


రియోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత్ సత్తా చాటింది. భారత కాలమానం ప్రకారం నేటి తెల్లవారుజామున జరిగిన హైజంప్ ఈవెంట్ లో భారత్ కు చెందిన మరియప్పన్ తంగవేలు స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. ఇదే ఈవెంట్ లో భారత్ కే చెందిన మరో క్రీడాకారుడు వరుణ్ సింగ్ భాటి కాంస్య పతకాన్ని చేజిక్కించుకున్నాడు. దీంతో భారత్ ఖాతాలో ఒకే ఈవెంట్ కు సంబంధించి రెండు పతకాలు పడినట్లైంది. స్వర్ణ పతకం సాధించిన మరియప్పన్ 1.89 మీటర్లతో అగ్రస్థానంలో నిలవగా, 1.86 మీటర్లతో వరుణ్ సింగ్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నారు. ఇక ఈ ఈవెంట్ లో అమెరికాకు చెందిన క్రీడాకారుడు శామ్ గ్రీవే రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News