: ప్రత్యేక హైకోర్టుపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను స్వాగతించిన కల్వకుంట్ల కవిత
ఏపీకి ప్రత్యేక హోదా కోసం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో గళమెత్తిన టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండాలంటూ పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కవిత... పవన్ కల్యాణ్ కామెంట్లను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం ఈ దిశగా దృష్టి సారించి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.