: భాగ్యనగరిలో ఏపీ అసెంబ్లీ చివరి సమావేశాలివేనన్న చంద్రబాబు!... సీఎం చాంబర్ లో చంద్రబాబుతో ఎమ్మెల్యేల సెల్ఫీల సందడి!


హైదరాబాదులో ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరిక జరగవు. ఇకపై ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా... నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి కేంద్రంగా మారనుంది. ఈ మేరకు నేటి ఉదయం శాసనసభా సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. హైదరాబాదులో ఏపీ అసెంబ్లీకి ఇవే చివరి సమావేశాలని ఆయన ప్రకటించారు. దీంతో ఇకపై హైదరాబాదులోని అసెంబ్లీకి రాబోమన్న విషయాన్ని తెలుసుకున్న పలువురు ఎమ్మెల్యేలు సీఎం చాంబర్ లోకి వెళ్లి చంద్రబాబుతో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News