: నా నుంచి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలూ ఉండవు: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో పోరు ఉద్ధృతమవుతోన్న వేళ సంయమనంతో ఆచితూచి ముందుకు వెళ్లాలని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను తీసుకున్న పలు కీలక నిర్ణయాల గురించి తెలిపారు. రాష్ట్రంలో భావోద్వేగాలు ఉన్న సమయంలో ఏదిపడితే అది మాట్లాడకూడదని పవన్ అన్నారు. తన సభకు వచ్చిన వారు ఎవరైనా చనిపోతే తనకు ఎంతో బాధ కలుగుతుందని పేర్కొన్నారు. తన వల్ల ఇతరులు నష్టపోవడం తనకు ఎంతమాత్రం ఇష్టం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా జరుగుతుంటే తాను ఉద్యమం మరో మార్గంలో చేసుకుంటానని చెప్పారు. తన నుంచి కొందరు ఆశిస్తున్నట్లు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలూ ఉండబోవని అన్నారు. కాగా, తాను ఇకపై సభలు నిర్వహించబోనని పవన్ ఈ ఉదయం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.