: బంగ్లాదేశ్ టెంపకో ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. మంటలు వ్యాపించి ఘోర అగ్ని ప్రమాదం
బంగ్లాదేశ్‌లోని గజిపూర్, తోంగి ప్రాంతంలో టెంపకో ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో తెల్లవారుజామున భారీ పేలుడు జరిగింది. దీంతో భారీగా మంటలు వ్యాపించడంతో 10 మంది మృతిచెందగా, మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఫ్యాక్టరీలోని బాయిలర్ ప్లాంట్‌లో సంభవించిన పేలుడు కారణంగా అగ్నిప్రమాదం జరిగిందని గుర్తించారు. ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.