: ఆడవాళ్లను అడ్డుపెట్టుకొని వైసీపీ నీచ రాజకీయాలు చేస్తోంది: టీడీపీ ఎమ్మెల్యే అనిత
ఆడవాళ్లను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు చేస్తోందని తెలుగుదేశం ఎమ్మెల్యే అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు శాసనసభను స్పీకర్ నిరవధిక వాయిదా వేసే ముందు ఆమె మాట్లాడుతూ... వైసీపీ సభ్యులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. సభ రెండు, మూడు రోజులు కాదు పదిరోజులు జరగాలని కోరిన వైసీపీ ఇటువంటి పరిస్థితి తీసుకురావడమేంటని ఆమె అన్నారు. ఇంతవరకూ ఏ శాసనసభలోనూ ఇటువంటి తీరు చూడలేదని ఆమె అన్నారు. వైసీపీ నేతలు ఎంతో దిగజారిపోయారని మండిపడ్డారు. మహిళా ఎమ్మెల్యేలను కూడా అడ్డుపెట్టుకొని వైసీపీ నీచ రాజకీయాలు చేస్తున్నారని అనిత అన్నారు. రాబోయే తరంలో అసెంబ్లీకి రావాలనుకునే వారికి ఎటువంటి సందేశం ఇస్తున్నారని ఆమె ప్రశ్నించారు. మూడు రోజులు కాదు ముప్పై రోజులు సభను నడిపించినా ఇదే పరిస్థితిని తీసుకొస్తారని అన్నారు.