: మీడియా పాయింట్ వద్ద హైటెన్షన్!... టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్యుద్ధం!
ఏపీ అసెంబ్లీ హాలులో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు తాజాగా మీడియా పాయింట్ వద్దకు చేరుకున్నాయి. ప్రత్యేక హోదాపై చర్చకు డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్దకు ముందుగా వైసీపీ చేరుకోగా... ఆ తర్వాత టీడీపీ సభ్యులు కూడా అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సాక్షిగానే ఇరు పక్షాల ఎమ్మెల్యేలు వాగ్యుద్ధానికి దిగారు. మీడియా కెమెరాల ముందు వైసీపీ నేతలు మాట్లాడేందుకు సిద్ధపడగా, మీడియా కెమెరాలకు అడ్డంగా నిలబడ్డ టీడీపీ సభ్యులు తాము కూడా మీడియాతో మాట్లాడేందుకు యత్నించారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.