: జకీర్ నాయక్‌కు మరో ఎదురుదెబ్బ.. ఐఆర్ఎఫ్‌ విదేశీ విరాళాల సేకరణపై నిషేధం


వివాదాస్పద ఇస్లాం మతబోధకుడు జకీర్‌నాయక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్)పై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఇక నుంచి ఈ ఎన్జీవో సంస్థ విదేశీ విరాళాలను నేరుగా సేకరించడాన్ని నిషేధించింది. ఐఆర్ఎఫ్‌కు విడుదలయ్యే విరాళాలపై ముందస్తు అనుమతి తీసుకునేలా హోంమంత్రిత్వ శాఖ రిజర్వ్ బ్యాంకును ఆదేశించింది. విదేశీ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్స్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్ఏ)కు విరుద్ధంగా ఐఆర్ఎఫ్ తన కార్యకలాపాలు నిర్వహిస్తోందని హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పార్లమెంటరీ కమిటీ దర్యాప్తులో తేలింది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఐఆర్ఎఫ్‌ ఇక నుంచి ముందస్తు అనుమతి కేటగిరీలోకి వెళ్తుందని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రకారం నగదు లావాదేవీలు నిర్వహించే ప్రతిసారి ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, విదేశాల నుంచి వచ్చే విరాళాలకు సంబంధించిన వివరాలను హోంమంత్రిత్వ శాఖకు తెలపాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News