: అసలు మీకేం కావాలి?... వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగిన బోండా ఉమ!
ఏపీ శాసనసభలో వరుసగా మూడో రోజూ ఆందోళనకు దిగిన విపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నిప్పులు చెరిగారు. అసలు మీకేం కావాలంటూ ఉమ చేసిన సుదీర్ఘ ప్రసంగం సాంతం జగన్ తీరును ఎండగట్టడమే లక్ష్యంగా సాగింది. సభలో హెల్మెట్లు పెట్టుకుని కూర్చోవాల్సిన దుస్థితి నెలకొందని ఆయన వాపోయారు. స్పీకర్ తన రక్షణ కోసం మార్షల్స్ ను పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. జగన్ ది ఫ్యాక్షన్ మెంటాలిటీ అన్న ఆయన... జగన్ మూర్ఖత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అసెంబ్లీ కార్యదర్శిని చంపడానికి వైసీపీ సభ్యులు యత్నించారని ఆయన ఆరోపించారు. సీట్లోనే కూర్చున్న జగన్ తన పార్టీ సభ్యులను స్పీకర్ పైకి ఉసిగొలుపుతున్నారన్నారు. ‘‘అసలు మీకేం కావాలో చెప్పండి. ప్రత్యేక హోదాపై చర్చకు మేం సిద్ధం. అవసరమైతే సమావేశాలను పొడిగించుకుందాం’’ అంటూ ఉమ ఓ రేంజ్ లో ఫైరయ్యారు.