: ఛండీగఢ్ లోనూ చెన్నై తరహా ‘శునక’ హింస!... వైరల్ గా మారిన వీడియో!


మొన్నటికి మొన్న తమిళనాడు రాజధాని చెన్నైలో ఇద్దరు మెడికోలు నోరు లేని ఓ కుక్కపై తమ ప్రతాపం చూపారు. పలు అంతస్తుల భవంతి పై నుంచి కుక్కను విసిరేసిన మెడికోలు దాని కాలు విరగడానికి కారణమయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. తాజాగా అలాంటి ఘటనే ఛండీగఢ్ లో చోటుచేసుకుంది. స్నేహితులు పక్కన నిలబడి చూస్తుండగా... ఓ యువకుడు కుక్క కాళ్లు పట్టుకుని గాల్లో గిరాగిరా తిప్పాడు. పలుసార్లు ఆ కుక్కను గాల్లోనే తిప్పిన సదరు ఉన్మాది... ఆ తర్వాత దానిని ఓ గోడకేసి కొట్టాడు. అదృష్టవశాత్తు ఎలాంటి గాయం కాని సదరు కుక్క... ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీసింది. ఈ దృశ్యాన్ని చూసిన ఆ ఉన్మాద యువకుడు తన స్నేహితులతో కలిసి విరగబడి నవ్వాడు. ఈ వ్యవహారమంతా వీడియోలో రికార్డు కాగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సదరు యువకుడితో పాటు అతడి స్నేహితులపై కూడా కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News