: చనిపోయిన అభిమాని ఇంటికి పవన్!... ‘తూర్పు’లోనే మూడో రోజు జనసేనాని!
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ‘సీమాంధ్రుల ఆత్మ గౌరవ సభ’కు హాజరైన జనసేనాని పవన్ కల్యాణ్ వరుసగా మూడో రోజు కూడా ఆ జిల్లాలోనే ఉండనున్నారు. నిన్న జరిగిన సభలో చోటుచేసుకున్న అపశ్రుతిలో పవన్ అభిమాని వెంకటరమణ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో చలించిన పవన్... నేడు జిల్లాలోని కాజులూరు మండలం కుయ్యూరులోని వెంకటరమణ ఇంటికి వెళ్లనున్నారు.