: దావూద్ తో బాలీవుడ్ టాప్ స్టార్ చెట్టాపట్టాల్!... ఫోన్ కాల్స్ తో అడ్డంగా దొరికిన వైనం!


భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో బాలీవుడ్ కు చెందిన ఓ టాప్ స్టార్ చెట్టాపట్టేలేసుకుని తిరుగుతున్నారట. 90వ దశకంలోనే భారత్ నుంచి పారిపోయిన దావూద్ పాకిస్థాన్ లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. దేశం విడిచిపోయినా దావూద్... భారత్ పై మాత్రం తన పట్టు కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాల చేతికి చిక్కిన ఫోన్ సంభాషణల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. బాలీవుడ్ లో భారీ ఎత్తున సంపాదిస్తున్న ఓ బడా స్టార్... తన డబ్బును అక్రమ మార్గాలలో పనామా, కెనడాలకు తరలిస్తున్నాడట. ఇందుకోసం అతడు దావూద్ ఇబ్రహీం సాయం తీసుకుంటున్నాడు. ఈ మేరకు దావూద్ తో ఆ బాలీవుడ్ స్టార్ జరిపిన ఫోన్ సంభాషణలు నిఘా వర్గాలకు చిక్కాయి. ఇక బాలీవుడ్ టాప్ స్టార్ లాగే భారత్ కు చెందిన పలువురు వ్యాపారులు, రాజకీయ నేతలు కూడా తమ అక్రమ సంపాదనను దేశ సరిహద్దులు దాటించేందుకు దావూద్ సాయాన్ని తీసుకుంటున్నట్లు కూడా ఆ వర్గాలకు పక్కా ఆధారాలు లభించాయట.

  • Loading...

More Telugu News