: డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఎంఐఎం నేత!... కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు!


భాగ్యనగరి హైదరాబాదులో డ్రంకన్ డ్రైవ్ కు అడ్డుకట్ట పడటం లేదు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నా పలువురు ప్రముఖులు మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడుతున్నారు. నిన్న రాత్రి బంజారాహిల్స్ పరిధిలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో ఎంఐఎం నేత జావెద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. మద్యం సేవించి కారు నడుపుకుంటూ వచ్చిన ఆయనను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. చెకింగ్ లో జావెద్ స్థాయికి మించి మద్యం సేవించారని తేలడంతో ఆయన కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన జావెద్... ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఈయనతో పాటు మరో 19 మంది కూడా డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిపోయారు.

  • Loading...

More Telugu News