: బంద్ ప్రశాంతంగా చేసుకుంటే సరే...విధ్వంసానికి దిగితే ఊరుకోము: ఏపీ హోం మంత్రి చినరాజప్ప


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై విపక్షాలు రేపు బంద్‌ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పందించారు. ప్రశాంతంగా బంద్‌ చేసుకుంటే అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. కానీ బంద్ ను పురస్కరించుకుని ప్రజలకు ఇబ్బంది కలిగించినా, విధ్వంసాలు రేపినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు. మరోపక్క, రేపటి బంద్ ను పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో డీజీపీ సాంబశివరావు భేటీ అయ్యారు. బంద్ సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణ అంశాలను జాగ్రత్తగా పరిరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News