: కొడుకు పుట్టలేదని నాలుగు నెలల కూతురిని చంపేసిన తల్లి


రెండో కాన్పులో కూడా తనకు మగపిల్లవాడు పుట్టలేదనే ఆవేదనతో నాలుగు నెలల కూతురిని పొట్టనపెట్టుకుంది ఓ తల్లి. రాజస్థాన్ లోని జయపురలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జయపురకు చెందిన మహిళ నేహా గోయల్ కు మొదటి కాన్సులో కూతురు పుట్టింది. రెండో కాన్పులో నేహా తనకు కొడుకు పుడతాడని భావించింది. ఆ విధంగా జరగకపోవడంతో, తన నాలుగు నెలల కూతురిని చంపివేసింది. అయితే, ఈ విషయం తనకేమీ తెలియనట్లు అమాయకంగా నటించిన నేహా, ఆ చిన్నారి కనిపించడం లేదంటూ తన కుటుంబ సభ్యులతో చెప్పడంతో వారు కంగారు పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. నేహా ఇంట్లో ఉపయోగించకుండా ఉన్న ఒక ఎయిర్ కండిషనర్ లో ఆ శిశువు మృతదేహాం ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆ శిశువుపై 17 కత్తిపోట్లు ఉండటంతో వారు షాక్ తిన్నారు. ఈ నేపథ్యంలో అనుమానం తలెత్తిన పోలీసులు, నేహా గదిని పరిశీలించగా హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు రక్తపు మరకలను కనుగొన్నారు. ఈ నేరం తానే చేసినట్లు పోలీసుల విచారణలో నేహా అంగీకరించడంతో ఆమెను అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News