: ఒంటరిగా ఉన్న మహిళపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం
ఇంట్లో ఒంటరిగా ఉన్న ఒక మహిళపై యాదగిరి అనే కానిస్టేబుల్ అత్యాచారానికి యత్నించాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలోని శాంతినగర్ లో జరిగింది. మహిళ అరుపులతో సదరు కానిస్టేబుల్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శాంతినగర్ లోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. నిందితుడు యాదగిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.